పోలింగ్ ముందు రైతుబంధు
నిధుల విడుదల కోడ్‌కు విరుద్ధం
కేసీఆర్ పాలనలో గుండాల రాజ్యంగా రాష్ట్రం
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి
బీజేపీ క్యాండిడేట్‌పై దాడి చేసిన
టీఆర్‌ఎస్ నాయకులపై మంచిర్యాల కలెక్టర్‌కు ఫిర్యాదు
బీజేపీ గెలుపు అభివృద్ధికి మలుపు
మంచిర్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసమే పోలింగ్‌కు రెండు రోజుల ముందు టీఆర్‌ఎస్ సర్కారు రైతుబంధుకు నిధులు రిలీజ్ చేసిందని పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇది ఎలక్షన్ కోడ్‌కు విరుద్ధమైనప్పటికీ ఈసీ కండ్లు మూసుకుందని అన్నారు. దీనిపై చర్యలు తీసుకునేంత వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. రైతుబంధు ఆన్‌గోయింగ్ స్కీం అని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నస్పూర్ మున్సిపాల్టీలో బీజేపీ క్యాండిడేట్‌పై టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయడంపై మంగళవారం మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హొళికెరికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే రైతుబంధుకు నిధుల విడుదలలో సర్కారు లేట్ చేసిందన్నారు. పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు రూ.5 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలోనూ రెండు విడతల నిధులు ఒకేసారి విడుదల చేసి టీఆర్‌ఎస్ గెలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌కు కమీషన్ల డబ్బులు ఎక్కువై ఇతర పార్టీల క్యాండిడేట్లను కొనుగోలు చేస్తున్నారని… బెదిరించి బలవంతంగా గులాబీ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే సుమన్ అభ్యర్థులను ప్యాకేజీలతో కొని, వినకుంటే బెదిరించి పలు వార్డులను ఏకగ్రీవం చేశాడన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేడ్కర్ ఆశయాలను అవమానపర్చాడన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ 23వ వార్డు బీజేపీ అభ్యర్థి అగల్‌డ్యూటీ రాజుపై టీఆర్‌ఎస్ నాయకులు, కార్యర్తలు ముప్పై మంది దాడి చేశారన్నారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం గూండాల రాజ్యంగా మారిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ నాయకులు డబ్బు, అధికారం, పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలన నిజాం హయాంను తలపిస్తోందన్నారు.
కరీంనగర్‌టౌన్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతోనే నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చేరువ కావాలంటే బీజేపీ క్యాండిడేట్లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన 44వ డివిజన్‌లో బీజేపీ క్యాండిడేట్ మెండి శ్రీలత- చంద్రశేఖర్ తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. అపోలో రోడ్డు అంబేడ్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర శర్మనగర్, సాయినగర్, కార్ఖానాగడ్డ, సాహెత్‌నగర్ మీదుగా సాగింది. అనంతరం 22వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి కటకం ప్రణీత -లోకేశ్ తరఫున సుభాష్ నగర్, వావిలాలపల్లిలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
