కొనసాగుతున్న నిజాం కాలేజీ విద్యార్థినుల ఆందోళన

కొనసాగుతున్న నిజాం కాలేజీ విద్యార్థినుల ఆందోళన

నిజాం కాలేజీలో విద్యార్థినుల ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. కొత్తగా నిర్మించిన హాస్టల్ బిల్డింగ్ పీజీ విద్యార్థినులకు ఇవ్వడంపై నిరసన తెలియజేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, నిన్న మంత్రి కేటీఆర్  ట్వీట్ చేశారు. త్వరలో పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రీట్వీట్ చేశారు .

విద్యార్థినుల హాస్టల్ బిల్డింగ్ సమస్యపై ఇవాళ నిజాం కాలేజీ  ప్రిన్సిపాల్ తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి తమను కూడా చర్చలకు ఆహ్వానించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల నిరసనకు  పలు విద్యార్థి సంఘాలు మద్ధతు తెలిపాయి.