
హైదరాబాద్, వెలుగు: పది రోజులుగా దంచికొడుతున్న ఎండ కొంత తగ్గింది. సిటీలో శుక్రవారం 44 డిగ్రీల టెంపరేచర్ ఉండగా, శనివారం 39 డిగ్రీలు నమోదైంది. రెండ్రోజులపాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చత్తీస్గఢ్ నుంచి లక్షదీవుల వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వెదర్ కూల్ అవడంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.