సుప్రీం కోర్టులో నీట్ యూజీ పేపర్ లీక్ కేసు వాయిదా

సుప్రీం కోర్టులో నీట్ యూజీ పేపర్ లీక్ కేసు వాయిదా

నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసు గురువారం విచారణను జులై 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేంద్రం, ఎన్టీఏ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లు..ఇంకా పిటిషనర్లకు చేరలేదు. దీంతో విచారణ వాయిదా వేసింది చీఫ్  జస్టిస్ తో కూడిన బెంచ్. గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి, ఎన్టీఏ, సీబీఐలకు నోటీసులిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. 

దీంతో నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ లిమిటెడ్ గా జరిగిందని బుధవారం (జూలై 10) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రప్రభుత్వం. ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదికలో  ఏ అభ్యర్థులకు అసాధారణ మార్కులు రాలేవని తెలిపింది.ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీలో 11మందిని అరెస్ట్ చేశామని..నీట్ యూజీ కౌన్సిలింగ్ జులై మూడో వారంలో  ప్రారంభిస్తామని అఫిడవిట్ లో తెలిపింది కేంద్రం. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.