
మియాపూర్, వెలుగు: భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్సామాగ్రిని దొంగిలిస్తున్న ముఠా సభ్యులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల విలువైన సెంట్రింగ్సామాగ్రి, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మియాపూర్ఏసీపీ శ్రీనివాస్కుమార్గురువారం వెల్లడించారు. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన పద్మ, బిల్లావత్లక్ష్మి, నేనావత్ అమృత, సభావత్సునీత, వదిత్య, అనిత, నేనావత్చందర్కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.
నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని దొంగిలించడం టార్గెట్‌గా పెట్టుకున్నారు. ముఠాలోని పలువురు సభ్యులు ఆటోల్లో పలు కాలనీల్లో తిరుగుతూ నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్‌ల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. అర్ధరాత్రి ఆటోల్లో వచ్చి బిల్డింగ్వద్ద ఉన్న సెంట్రింగ్సామాగ్రిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నెల 19న మియాపూర్‌లోని ఓ భవన నిర్మాణం వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని దొంగలించారు.
ఈ ఘటనపై బిల్డింగ్ఓనర్ ఫిర్యాదుతో మియాపూర్పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్ చందర్‌తో పాటు ఆరుగురు మహిళలను అరెస్ట్ చేశారు.