సౌతాఫ్రికా టార్గెట్ 180 రన్స్

సౌతాఫ్రికా టార్గెట్ 180 రన్స్

సాగరతీరంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాట్స్మన్ రాణించారు. ప్రొటీస్  జట్టుకు 180 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించారు.  టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 97 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే 97 రన్స్ వద్ద రుతురాజ్ ఔటవడంతో ఆ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ డౌన్లో వచ్చిన శ్రేయస్ 14 పరుగులే చేసి పెవీలియన్ చేరాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ కూడా ఔటయ్యాడు. అనంతరం రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ స్వల్ప వ్యవధిలో  పెవీలియన్ బాట పట్టారు. దీంతో భారత్ 153 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.  ఓ వైపు వికెట్లు పడుతున్నా..హార్థిక్ పాండ్యా మాత్రం బ్యాట్ ఝుళిపించాడు. 21 బంతుల్లో 31 పరుగులు చేయడంతో  చివరకు టీమిండియా 20 ఓవర్లలో 179 పరుగులు సాధించింది.  సౌతాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీసుకున్నాడు. రబాడా, షామ్సీ, కేశవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.