గాడ్ ఫాదర్ టీజర్ ముహూర్తం ఫిక్స్

గాడ్ ఫాదర్ టీజర్ ముహూర్తం ఫిక్స్

గాడ్ ఫాదర్ టీజర్ కోసం ఎదరుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22న  చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ మూవీ టీజర్‌ను ఈ నెల 21న విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’ మూవీని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో చిరంజీవి రఫ్‌లుక్‌ కేక పుట్టిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు. ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా... ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ నడుస్తోంది.