మేనిఫెస్టోలో జర్నలిస్టుల అంశాలు చేర్చాలి

మేనిఫెస్టోలో జర్నలిస్టుల అంశాలు చేర్చాలి
  • మేనిఫెస్టోలో జర్నలిస్టుల అంశాలు చేర్చాలి
  • రేవంత్​కు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలి స్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను చేర్చా లని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక విజ్ఞప్తి చేసింది. సోమవారం పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డిని అధ్యయన వేదిక నేతలు కలిసి 9 ప్రధాన డిమాండ్లతో  వినతిపత్రాన్ని అందజేశారు.  అందులో ‘‘వర్కింగ్ జర్న లిస్ట్​ యాక్ట్ ను మళ్లీ తీసుకొచ్చి అందులో ప్రింట్, ఎల క్ట్రానిక్​ మీడియా జర్నలిస్టుల ఉద్యోగ రక్షణ నిబంధనలను పొందుపరచాలి.

ఈఎస్ఐ, పీఎఫ్​ కట్టకుండా వేతనాలు ఎగ్గొడ్తున్న యాజమాన్యాలను కార్మిక చట్టం పరిధిలోకి తీసుకురావాలి. మీడియా అకాడమీకి వెల్ఫేర్​ ఫండ్​ను రూ.200 కోట్లకు పెంచాలి. వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు.. ఆ కుటుంబానికి నెలకు రూ.5000 పింఛన్ ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు.