పిల్లలు,యూత్ జాగ్రత్త.. కరోనా సోకుతున్నవారిలో 70 శాతం వీళ్లే

పిల్లలు,యూత్ జాగ్రత్త.. కరోనా సోకుతున్నవారిలో 70 శాతం వీళ్లే


హైదరాబాద్, వెలుగు: రాబోయే 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశారు.  ప్రస్తుతం రాష్ర్టంలో పరిస్థితి, సెకండ్ వేవ్‌‌‌‌‌‌‌‌కు కారణాలు, భవిష్యత్‌‌‌‌‌‌‌‌ పరిణామాలు, కరోనా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌, తదితర అంశాలపై ఆయన ‘వీ6 వెలుగు’తో మాట్లాడారు. 

వెలుగు: సెకండ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడే ఎందుకొచ్చింది?

శ్రీనివాసరావు: మన దగ్గర సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైరస్‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. ఏ వైరస్ అయినా పీక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన తర్వాత రిలాక్స్ అవుతుంది. కరోనా కూడా అలాగే రిలాక్స్ అయింది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో హెర్డ్ ఇమ్యూనిటీ కూడా కొన్ని నెలలు మనకు రక్షణ ఇచ్చింది. అది పోగానే కేసులు పెరగడం స్టార్ట్ అయింది. జనాలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వేగంగా స్ర్పెడ్ అవుతోంది.

కొత్త వేరియంట్స్ వల్లే  స్ప్రెడ్ అవుతోందా? 

కొత్త వేరియంట్లు కూడా ఉన్నాయి. కానీ, మన స్టేట్‌‌‌‌‌‌‌‌లో పాత వేరియంట్‌‌‌‌‌‌‌‌ మాత్రమే స్ర్పెడ్ అవుతోంది. ఇదివరకే కరోనా వచ్చినవాళ్లలో, చాలా తక్కువ మందికే మళ్లీ వస్తోంది. ఇప్పుడు వైరస్ బారిన పడుతున్నవాళ్లంతా కొత్తవాళ్లే.. ముఖ్యంగా పిల్లలు, యువతే ఎక్కువ మంది ఉంటున్నారు. 70% ఈ రెండు గ్రూపుల వాళ్లుంటే, 30% మిడిల్, ఓల్డ్ ఏజ్‌‌‌‌‌‌‌‌ వాళ్లు ఉంటున్నారు. 

ఈసారి పల్లెల్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటున్నారు?

ఇప్పుడు వచ్చే కేసుల్లో ఎక్కువ గ్రామాల్లోనే వస్తున్నాయి. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌లో గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సగం మందికి, పల్లెల్లో 25% మందికి వచ్చినట్టు సీరో సర్వేల్లో తేలింది. ఈసారి పల్లెల్లో ఎక్కువ మందికి, సిటీల్లో తక్కువ మందికి సోకే చాన్స్ ఉంది. 

కట్టడికి ఏంచర్యలు తీసుకుంటున్నారు? 

టెస్టుల సంఖ్య పెంచినం. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసినం. ప్రజల్లో అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ కల్పిస్తున్నాం. మాస్క్‌‌‌‌‌‌‌‌, వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కంట్రోల్ చేయగలవు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఇది ప్రూవ్ అయింది. వ్యాక్సినేషన్ తర్వాత ఆ దేశాల్లో కేసులు, మరణాలు తగ్గిపోయాయి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అందుకే అక్కడ అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మన దగ్గర కూడా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే 45 ఏండ్లు దాటినోళ్లకు ఇస్తున్నాం. ఇంకో నెల రోజుల్లో 18– 45 ఏండ్ల మధ్య ఉండి, కోమార్బిడిటీస్ ఉన్నోళ్లకు కూడా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి వస్తుంది. 

వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకూ వస్తోంది కదా?

వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ వేసుకున్నవాళ్లకూ వైరస్ సోకే చాన్స్ ఉంది. ఏ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌లోనైనా ఇది సహజమే. అయితే వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లలో వైరస్‌‌‌‌‌‌‌‌ సోకినా, దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ పది నెలల వరకే ప్రొటెక్షన్ ఇస్తుంది. వైరస్ వేరియంట్‌‌‌‌‌‌‌‌ మారినట్టే, వ్యాక్సిన్‌కూ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌ వస్తుంది.

కొత్త వ్యాక్సిన్లు ఏమైనా వచ్చే చాన్స్ ఉందా?

స్పుత్నిక్‌‌‌‌‌‌‌‌, నియోకోవ్ వంటి వ్యాక్సిన్లు ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ దశలో ఉన్నాయి. అవి ఎప్పుడొస్తాయో చెప్పలేం. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు తప్ప ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కరోనా వచ్చినోళ్లూ తీసుకోవాల్సిందే. పాజిటివ్ వచ్చిన 20 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

సెకండ్ వేవ్‌‌‌‌‌‌‌‌ ఎంత కాలం ఉండొచ్చు?

మా అంచనా ప్రకారం 2 నుంచి 3 నెలల్లోనే సెకండ్ వేవ్‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే చాన్స్ ఉంది. ఈ 3 నెలల్లోనే 10 నుంచి 15 లక్షల కేసులు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడుతాయి. వైరస్ చాలా వేగంగా స్ర్పెడ్ అవుతోంది. దీనివల్ల హాస్పిటళ్లలో అడ్మిషన్లు పెరిగి, పేషెంట్‌‌‌‌‌‌‌‌ కేర్ వర్కర్స్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వైరస్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌ను తగ్గించే చర్యలు తీసుకుంటున్నాం. మాస్క్, డిస్టెన్స్ వంటివి పాటిస్తేనే వైరస్ స్పీడ్ తగ్గుతుంది. లేకుంటే భారీ నష్టం తప్పదు. 

రూరల్‌‌‌‌‌‌‌‌లో వ్యాక్సినేషన్ సెంటర్లు ముందే ఎందుకు పెట్టలేదు? 

ఒక్క బుడ్డీలో పది డోసుల వ్యాక్సిన్ ఉంటుంది. వయల్ ఓపెన్ చేస్తే వెంటనే దాన్ని వాడాలి. లేకుంటే వేస్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. రూరల్‌‌‌‌‌‌‌‌లో ముందునుంచే సెంటర్లు పెట్టినా జనాలు వచ్చే పరిస్థితి లేకుండే. అందుకే జనాల్లో వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌పై నమ్మకం కుదిరాకే సెంటర్లు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు రోజూ వెయ్యికిపైగా సెంటర్లలో వ్యాక్సిన్‌ వేస్తున్నాం. హెల్త్ వర్కర్లు ఊర్లలోకి వెళ్లి జనాలను అవేర్ చేస్తున్నారు. ఒక్కో ఊరికి ఒక రోజు కేటాయించి, అక్కడి వాళ్లందరిని ఆ రోజు వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించేందుకు ప్లాన్ చేస్తున్నాం.