గ్రూప్-1 మెయిన్స్​ ప్లాన్​

గ్రూప్-1 మెయిన్స్​ ప్లాన్​

తెలంగాణలో తొలిసారి నిర్వహించిన గ్రూప్‌‌‌‌-1 ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్ష ఫైనల్ కీ తెలంగాణ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ విడుదల చేసింది. దాదాపు మూడు లక్షల మందిలో 1:50 శాతం చొప్పున అభ్యర్థులను మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. 503 ఉద్యోగాలకు 25,000 మంది తుది పరీక్ష రాయనున్నారు.  ఫైనల్​ ఎగ్జామ్​కు క్వాలిఫై అవుతామనే నమ్మకం ఉన్న అభ్యర్థులు తక్షణమే ప్రిపరేషన్‌‌‌‌ ప్రారంభించాలి. మెయిన్స్‌‌‌‌ పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ప్రిపరేషన్‌‌‌‌ ప్లాన్​ ఎలా ఉండాలో తెలుసుకుందాం..

మెయిన్స్‌‌‌‌కు మల్టీజోన్లవారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంట్లో రూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌ పాటిస్తారు. కులం, లింగం, ఈడబ్ల్యూఎస్‌‌‌‌, పీహెచ్‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌ కోటాల ప్రకారం సెలెక్షన్​ ఉంటుంది. జనరల్‌‌‌‌ ఇంగ్లిష్‌‌‌‌ తప్ప మిగతా ఆరు పేపర్లు మూడు భాషల్లో రాయవచ్చు. క్వాలిఫైయింగ్‌‌‌‌ పేపర్‌‌‌‌ అయిన జనరల్‌‌‌‌ ఇంగ్లిష్‌‌‌‌ను ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ సిలబస్‌‌‌‌ను అనుసరించి నిర్వహిస్తారు. సబ్జెక్ట్​ నాలెడ్జ్​ తో  పాటు సరైన స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్​ అయితే మెయిన్స్​లో సక్సెస్​ కావొచ్చు. చదవడంతో పాటు రైటింగ్​ ప్రాక్టీస్​ చాలా ముఖ్యం. 

పేపర్​1 – జనరల్​ ఎస్సే: జనరల్​ ఎస్సే కోసం ప్రత్యేకంగా చద వాల్సిన అవసరం లేదు. కానీ ప్రాక్టీస్​ తప్పనిసరి ఉండాలి. దీనిలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. 1) సమ కాలీన సామాజిక అంశాలు, సమస్యలు– ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశా లు, 2) భారత రాజకీయ స్థితిగతులు–భారతీయ చరిత్ర సాంస్కృతిక వార సత్వం,3) సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టెక్నాలజీ అభి వృద్ధి– విద్య, మానవ వనరుల అభివృద్ధి ఇలా మూడు సెక్షన్​లుగా విభజిస్తారు. ప్రతి సెక్షన్​కు 2 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.  అందులో ఒక ప్రశ్నకు సమా ధానం రాయాలి. సంపూర్ణ అవగాహన ఉన్న సబ్జెక్ట్​ను ఎంపిక చేసుకోవడం ఉత్త మం. ఉదాహరణకు సెక్షన్​2లో భారత రాజకీయాలు లేదా భారత చారిత్రక, సాంస్కృతిక సంపద అంశాలు ఉంటా యి. ఇందులో చరిత్ర మీద పట్టు ఉంటే రెండో దాన్ని సెలెక్ట్​ చేసుకోవడం బెటర్. 

పేపర్​ 2,  సెక్షన్​–1  (భారతదేశ చరిత్ర, ప్రధానంగా ఆధునిక చరిత్ర):  డిగ్రీలో చరిత్ర నేపథ్యం లేని అభ్యర్థులకు ఈ సెక్షన్​ చదవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కారణం ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు రెండు యూనిట్లలో ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రామాణిక పుస్తకాలను చదివి సొంతంగా నోట్స్​ తయారు చేసుకోవాలి. రోజుకు కనీసం ఐదు ప్రశ్నలు రాసి సంబంధిత సబ్జెక్ట్ ఎక్స్​పర్ట్​తో కరెక్షన్ చేపించుకుంటే అందరికంటే ప్రతి ప్రశ్నకు ఒకటి లేదా రెండు మార్కులు అదనంగా పొందవచ్చు. చరిత్ర సబ్జెక్టుకు ‘కీ పదాలు’ చాలా ముఖ్యం. కీ పదాలు అంటే ఉదాహరణకు ‘వర్ణించండి’ అన్నప్పుడు వివరించకూడదు, సాధ్యమైనంత వరకు వాస్తవ ఆధారాలతో సమాధానం రాయాలి. 

పేపర్​ 2, సెక్షన్​–2 (తెలంగాణ చరిత్ర, ఆధునిక చరిత్ర): ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించి స్టాండర్డ్​ పుస్తకాలను మాత్రమే చదవాలి. సిలబస్​లో ఉన్న అంశాలపై మాత్రమే ఫోకస్​ చేస్తూ ప్రాక్టీస్​ చేయాలి. చదువుతున్న పుస్తకంలో అన్ని టాపిక్స్​ చదవడం కాకుండా సిలబస్​లో ఉన్న అంశాలపై ఫోకస్​ చేయాలి. సమాధానం రాయడంలో ‘నిర్మాణం’ చాలా ముఖ్యం. ఒక ప్రశ్నకు ప్రారంభం, బాడీపార్ట్, ముగింపు సరైన పద్ధతిలో రాయాలి. ఆధునిక తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా పోలీస్​ యాక్షన్, భారత యూనియన్​లో హైదరాబాద్​ రాజ్యం విలీనం టాపిక్స్​ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.

పేపర్​ 2, సెక్షన్​–3 (భారత మరియు తెలంగాణ జాగ్రఫీ): ఈ సెక్షన్​లో భారతదేశ జాగ్రఫీపై రెండు యూనిట్లు మాత్రమే ఉంటాయి. కాని సిలబస్​లో మొత్తం సబ్జెక్ట్ ఉంది. ఇండియా జాగ్రఫీలో మొదటి యూనిట్​లో విస్తృతంగా సిలబస్​ ఉంటే, రెండో యూనిట్​లో పరిమితంగా మాత్రమే ఉంది. తెలంగాణ జాగ్రఫీపై జరుగుతున్న తొలి గ్రూప్​1 పరీక్ష.  కొన్ని అంశాలపై ఎక్కువ ఫోకస్​ చేయాలి. ఉదాహరణకు జనాభా, పరిశ్రమలు, వలసలు, నేలలు, ఖనిజాలు మొదలైనవి. 

పేపర్​ 3, సెక్షన్–1 (భారతీయ సమాజం):  ఈ సెక్షన్​ సిలబస్​ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలంగాణ అంశాలు మాత్రం రెండు యూనిట్లలో ఉంటే, మిగతా అంశాలు మూడు యూనిట్లలో ఉన్నాయి. ఒక యూనిట్​లో పూర్తిగా తెలంగాణ అంశాలు ఉంటే, మరో యూనిట్​లో తెలంగాణ మరియు భారతదేశ సామాజిక విధానాలు, పథకాలు ఉన్నాయి. సామాజిక సమస్యలకు సంబంధించిన యూనిట్​లో ఎక్కువ అంశాలు ఉన్నాయి.

పేపర్​ 3, సెక్షన్​–2 (భారత రాజ్యాంగం):  ఈ సబ్జెక్ట్​ చదివేటప్పుడు సులభంగా ఉండి, రాసేటప్పుడు టఫ్​గా అనిపిస్తుంది. కారణం రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉండడంతో పాటు కొన్నిసార్లు కేసులను కోట్​ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్​ రాసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజ్యాంగంపైన ప్రశ్నలు డైరెక్ట్​గా కాకుండా అప్లికేషన్​ పద్ధతిలో పరోక్షంగా ఇస్తారు. 

పేపర్​ 3, సెక్షన్​–3 ( గవర్నెన్స్​):  ఈ సెక్షన్​ సిలబస్​ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రిపేర్​ అవ్వడం కష్టంగా ఉంటుంది. రెండు యూనిట్లకు సంబంధించిన​ అంశాలు పాలిటీకి లింక్​ అయి ఉంటే, ఒక యూనిట్​ మాత్రం ప్రభుత్వ పథకాలు, ఏజెన్సీకి సంబంధించిన అంశాలు సులువుగా అర్థం చేసుకోవచ్చు. 

పేపర్ ​4, సెక్షన్​–1  (ఇండియన్​ ఎకానమీ):  భారతదేశ ఎకానమీ సిలబస్​ లిమిటెడ్​గా ఉంది. కానీ ఎకానమీపై పూర్తిగా పట్టు ఉండకపోవడం వలన కఠినంగా కనిపించవచ్చు. వ్యాసరూప ప్రశ్నల్లో కొన్నింటికి సంఖ్యలు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సంఖ్యలను కోట్​ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తు ఉంటేనే రాయాలి. రెండు యూనిట్లు సులభంగా ఉంటే మూడు యూనిట్లు కొంచెం కఠినంగా ఉంటాయి. 

పేపర్ ​4, సెక్షన్​–2 (తెలంగాణ ఎకానమీ):  సమకాలిన అంశాలతో పాటు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన యూనిట్లు రెండు అయితే, 1956 నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఉన్న అంశాల మీద మూడు యూనిట్లు ఉన్నాయి. రెండు యూనిట్లకు సంబంధించిన అంశాలు సంఖ్యలతో కూడినది,  అయితే రెండు యూనిట్లు డేటాతో కూడుకున్నవి. ఒక యూనిట్​ పూర్తిగా భూ సంస్కరణలు ఉంటాయి. 

పేపర్​ 4, సెక్షన్​–3 (అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు): ఇందులో పూర్తిగా సిద్ధాంతాలతో కూడిన యూనిట్లు మూడు అయితే , చట్టాలతో కూడిన యూనిట్​ ఒకటి ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణం. ఈ సబ్జెక్ట్ సులువుగా ఉన్నా ఆన్సర్​ రాసే విధానం బాగుండాలి. సమాధానం సరిగ్గా రాస్తే అందరికంటే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. 

పేపర్​ 5, సెక్షన్​–1 (సైన్స్​ అండ్​ టెక్నాలజీ):  సైన్స్​ అండ్​ టెక్నాలజీ సబ్జెక్ట్​  దాదాపు తొంభై శాతం సమకాలిన అంశాలతో కూడుకుంది. కాబట్టి కరెంట్ ఎఫైర్స్​ మీద మంచి పట్టు సాధించాలి. రెండు యూనిట్లు మాత్రం స్పేస్​ గురించి ఉంటాయి.  ఒక యూనిట్​ పూర్తిగా శక్తి వనరుల గురించి ఉంటుంది.

పేపర్​ 5, సెక్షన్​–2 ( సైన్స్​):  సైన్స్​లో ఆధునిక ట్రెండ్​ ఏ విధంగా ఉంది అనే అంశంపైన ఈ సెక్షన్​ ఉంది. వ్యాక్సిన్​ తయారీపైన పూర్తిగా ఒక యూనిట్​ కేటాయించారు. భారతదేశంలో ఆధునిక పంటల సైన్స్​కి సంబంధించి ఒక యూనిట్​ అయితే బయోటెక్నాలజీకి సంబంధించి రెండు యూనిట్లు ఉన్నాయి.  అంటువ్యాధులపై  ఒక యూనిట్​ పూర్తిగా ఇచ్చారు. 

పేపర్​ 5, సెక్షన్​–3 ( డేటా ఇంటర్​ప్రిటేషన్​):  ఇది పూర్తిగా ప్రాక్టీస్​తో కూడుకున్న సెక్షన్​. రోజుకు కనీసం ఒక గంట అయిన ప్రాక్టీస్​ చేస్తే మంచి స్కోర్​ చేయచ్చు. ఒక యూనిట్ డెసిషన్​ మేకింగ్​ మరియు ప్రాబ్లమ్​ సాల్వింగ్​తో కూడుకుంది కాబట్టి అందరికి సమానంగానే ఉంటుంది. డేటా ఇంటర్​ప్రిటేషన్​కి సంబంధించి రెండు యూనిట్లు ఉన్నాయి.

పేపర్​ 6 ( తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర ఆవిర్భావం) : ఇందులో తెలంగాణ ఉద్యమ మూడు దశలు(తెలంగాణ భావన, సమీకరణ దశ, రాష్ట్ర ఆవిర్భావ దశ) చేర్చారు. ఈ మూడింటికి సంబంధించి మొత్తం 15 చాప్టర్లు ఉన్నాయి. ముల్కీ ఉద్యమ నేపథ్యం నుంచి వివిధ ఒప్పందాల ఉల్లంఘన వరకు, రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలన్నింటిని విశ్లేషణాత్మకంగా అభ్యర్థులు చదువుతూ సొంత నోట్స్​ సిద్ధం చేసుకోవాలి.  తెలంగాణ ఏర్పాటు కోసం పనిచేసిన వివిధ కమిటీలు, అవి ఇచ్చిన రిపోర్టులు పూర్తిగా చదవాలి. వివిధ ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం, కవులు, కళాకారులు, విధ్యార్థులు, రచయితలు పోషించిన పాత్రలు చాలా ముఖ్యమైనవి. -పృధ్వీ కుమార్ చౌహాన్, పృధ్వీస్ IAS స్టడీ సర్కిల్