తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీజీసీఏబీ) కో–ఆపరేటివ్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 25.
పోస్టు పేరు: కో–ఆపరేటివ్ ఇంటర్న్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం సంస్థ నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ కో–ఆపరేటివ్ మేనేజ్‌మెంట్/ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 14
లాస్ట్ డేట్: మే 25.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ , ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ tgcab.bank.inను సందర్శించండి.
