భద్రాచలం, వెలుగు: భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ గిరిజన గురుకుల 6వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడా పోటీల్లో రెండో రోజు ఆదివారం అథ్లెటిక్స్ అండర్ -17 విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో పి.శ్రీ తేజ ఫస్ట్(భద్రాచలం), ఎ. వైష్ణవి సెకండ్(ఇచ్చోడు), 400 మీటర్ల పరుగు పందెంలో కె.నందిని ఫస్ట్(ఎల్లారెడ్డి), కె జాహ్నవి సెకండ్(భద్రాచలం), 800 మీటర్ల పరుగు పందెంలో కె. నందిని ఫస్ట్, ఆర్. మౌనిక సెకండ్(సిరిసిల్ల), 300 మీటర్ల పరుగు పందెంలో ఎల్.అఖిల ఫస్ట్(ఎల్లారెడ్డి), ఎం. సింధు సెకండ్(జడ్చర్ల), లాంగ్ జంప్ లో పి. శ్రీతేజ ఫస్ట్, ఎం.సరస్వతి సెకండ్(జైనూర్), షాట్ ఫుట్ లో పి.శ్రీతేజ ఫస్ట్, బి. పల్లవి సెకండ్(ఇంద్రవల్లి), డిస్క్ త్రో లో వై. బిందుప్రియ ఫస్ట్(కాటారం), పి.పల్లవి సెకండ్(ఇంద్రవెల్లి) ప్లేస్లో నిలిచారు.
అండర్ 14 విభాగంలో 400 మీటర్ల విభాగంలో ఎం. నక్షత్ర ఫస్ట్(ఎల్లారెడ్డి), బి. లావణ్య సెకండ్(చేగుంట), 600 మీటర్ల విభాగంలో పి. ఇందు ఫస్ట్(భద్రాచలం), ఎ. నక్షత్ర సెకండ్(ఎల్లారెడ్డి), లాంగ్ జంప్ లో పి.ఇందు ఫస్ట్, సీహెచ్. సబిత సెకండ్(కొత్తగూడెం), షార్ట్ పుట్ లో పి.ఇందు ఫస్ట్(భద్రాచలం), కె. సంధ్య సెకండ్(జై నూరు), డిస్క్త్రోలో బి.వైశాలి ఫస్ట్(ఆసిఫాబాద్), జి.శ్రీదేవి సెకండ్(తుంగతుర్తి), అండర్ -19 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో బి.వెన్నెల ఫస్ట్(పాలకుర్తి), నిఖిత సెకండ్(ఏటూరు నాగారం), 400 మీటర్ల పరుగు పందెంలో బి.హరిత ఫస్ట్(ఎల్లారెడ్డి), పి. దివ్య సెకండ్(భద్రాచలం), 800 మీటర్ల పరుగు పందెంలో బి.హరిత ఫస్ట్, ఆర్.కళావతి సెకండ్(దామరచర్ల), 300 మీటర్ల పరుగు పందెంలో బి.హరిత ఫస్ట్, ఆర్.కళావతి సెకండ్, లాంగ్ జంప్ లో నిఖిత ఫస్ట్, కె. దీపిక సెకండ్(కల్వకుర్తి), షాట్ పుట్ లో కె.పల్లవి ఫస్ట్(సుదిమల్ల), కె.వెన్నెల సెకండ్(అంకంపాలెం), డిస్క్త్రోలో కె.వెన్నెల ఫస్ట్, టి.చంద్రకళ సెకండ్(అంకంపాలెం) ప్లేస్సాధించారు.
