గవర్నమెంట్ హాస్పిటళ్లలో పెచ్చులూడుతున్నయ్

గవర్నమెంట్ హాస్పిటళ్లలో పెచ్చులూడుతున్నయ్
  • బోధన్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో కూలిన పీవోపీ
  • ఓపీ వద్ద ఊడిన పెచ్చులు.. వార్డుల్లో కారుతున్న వాన నీళ్లు ..
  • మెదక్ దవాఖాన డయాలసిస్సెంటర్లో ఊడిన సీలింగ్
  • రూముల్లో, బెడ్ల మీద నీళ్లు .. కరెంట్ సప్లై బంద్
  • రోజంతా వెయిట్ చేసి వెళ్లిపోయిన కిడ్నీ పేషెంట్లు
  •  హాస్పిటళ్ల పరిస్థితిపై డాక్టర్లు , మెడికల్ స్టాఫ్ ఆందోళన

నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గవర్నమెంట్ హాస్పిటళ్లు ఉరుస్తున్నాయి. రూముల్లో నీళ్లు చేరుతున్నా యి. సీలింగ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్) కుప్ప కూలింది. మెదక్ గవర్నమెంట్ దవాఖానా డయాలసిస్ సెంటర్లో శ్లాబ్ పెచ్చులు ఊడి బెడ్లపై పడ్డాయి. రెండు హాస్పిటళ్లలోనూ పలు చోట్లనీళ్లు చేరాయి. దీనిపై హాస్పిటళ్లకు వచ్చిన పేషెంట్లతో పాటు డాక్టర్లు, మెడికల్స్ స్టాఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవ శాత్తు పేషెంట్లు, హెల్త్ స్టాఫ్ ఎవరికీ ప్రమాదం జరగలేదు.

బోధన్లో ఇటు రిపేర్లు..

అటు పెచ్చులు బోధన్ ఏరియా హాస్పిటల్ ను కొంతకాలం కింద జిల్లా హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేశారు. ఈ బిల్డింగ్ లో తరుచూ వాన నీళ్లు లీకవుతున్నాయి. లీకేజీలు ఆపేందుకు, ఆపరేషన్ థియేటర్‌లో రిపేర్ కోసం  2016 నుంచి మూడు సార్లు ఫండ్స్ మంజూరయ్యా యి. మొదట రూ.50 లక్షలతో , రెండోసారి రూ.30 లక్షలతో రిపేర్లు చేశారు. అయినా మళ్లీ లీకవుతుండటంతో కలెక్టరేట్ మరో రూ.18 లక్షలు శాంక్షన్చేశారు. నాలుగైదునెలల పాటు ఈ పనులు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. సోమవారం ఆపరేషన్ థియేటర్ లోని పీవోపీ సీలింగ్ ఊడి కుప్పకూలింది. ఆ టైంలో పేషెంట్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఓపీ డిపార్ట్మెంట్ వద్ద కూడా పెచ్చులూడి పడ్డాయి. డాక్టర్లు ఉండే స్టాఫ్ రూం, ఆరోగ్యశ్రీ, మెటర్నిటీ, జనరల్, చిల్డ్ర న్, పేమెంట్ వార్డులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించే వార్డుల్లోనూ వాన నీళ్లు ఊరుస్తున్నాయి.

మెదక్ లో కిడ్నీ పేషెంట్ల గోస

మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్లోని డయాలసిస్ సెంటర్లో సీలింగ్ పెచ్చులూడి బెడ్లపై పడ్డాయి. వర్షానికి పైకప్పు లీకై గదుల్లో, బెడ్ల మీద నీళ్లుకారాయి. కరెంట్ సప్లై ఆగిపోయింది. సోమవారం ఉదయం డోర్లు తెరిచే సరికి ఇదంతా చూసిన స్టాఫ్ ఆందోళన చెందారు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది కిడ్నీ పేషెంట్లు సెంటర్ దగ్గరికి వచ్చారు. చాలా సేపు వెయిట్ చేశారు. చివరికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి, అడిషనల్ కలెక్టర్ నగేశ్ కు  ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. అడిషనల్ కలెక్టర సెంటర్ దగ్గరికి వచ్చి పరిశీలించారు. ఇంటర్నల్ కేబుల్స్ దెబ్బతినడంతో తరచూ కరెంట్ సప్లై ఆగి, డయాలసిస్ నిలిచిపోతోందని సెంటర్ ఇన్చార్జి వివరించారు. దీంతో వెంటనే కరెంట్ రిపేర్లు చేయాలని ట్రాన్స్కో ఏఈకి, పైకప్పు నుంచి నీళ్లు కారకుండా టెంపరరీగా టార్పాలిన్లు కప్పించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ కు అడిషనల్ కలెక్టర్  ఆదేశించారు. చివరికి సాయంత్రం నా లుగున్నరకు కరెంట్ సమస్య తీరింది. కానీ అప్పుడు డయాలసిస్ చేయలేక మంగళవారం రావాలని చెప్పి పేషెంట్లను ఇండ్లకు పంపించారు