ఈ ఏడాది నవంబర్ నాటికే 56,485 మంది ఫారిన్ టూరిస్టుల సందర్శన

ఈ ఏడాది నవంబర్ నాటికే 56,485 మంది ఫారిన్ టూరిస్టుల సందర్శన

నిరుడు 5,917 మంది ఫారినర్స్ రాక

హైదరాబాద్, వెలుగు: కరోనా కాలంలో గట్టి దెబ్బతిన్న టూరిజం రంగం.. క్రమంగా కోలుకుంటోంది. రెండేండ్లతో పోలిస్తే రాష్ట్రంలోని టూరిస్టు స్పాట్లను సందర్శించిన దేశీయ, ఫారిన్ టూరిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. లాక్ డౌన్ టైంలో భయంతో ఇండ్లకే పరిమితమైన ప్రజలు ఆహ్లాదం కోసం బయటికి వస్తున్నారు. దీంతో పర్యాటక రంగం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. వీకెండ్​లలో పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు టూరిస్టులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు టూరిజం సర్క్యూట్ల డెవలప్ కోసం ఏడేండ్లుగా కేంద్రం నిధులు ఇస్తోంది. నిరుడు రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం, స్టేట్ టూరిజం కార్పొరేషన్ తీసుకుంటున్న చర్యలు కూడా పర్యాటక రంగానికి ఊతమిస్తున్నాయి.

క్రమంగా కరోనా ముందు నాటి స్థితికి..  

కరోనాకు ముందు చారిత్రక ప్రదేశాలు, సరస్సులు, నదులు, వాటర్ ఫాల్స్ కు టూరిస్టుల తాకిడి ఎక్కువ ఉండేది. 2020 మార్చి తర్వాత భారీగా తగ్గిపోయింది. కరోనా లేనప్పుడు 2019లో 8,30,35,894 మంది దేశీయ టూరిస్టులు, 3,23,326 మంది ఫారిన్​ టూరిస్టులు పర్యాటక ప్రదేశాలను విజిట్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ 2020 మార్చి నుంచి ప్రారంభమైంది. ఆ ఏడాది దేశీయ పర్యాటకుల సంఖ్య సగానికి (4,00,55,581) పడిపోయింది. జనవరి నుంచి మార్చి 15 దాకా ఫ్లయిట్స్ నడిచినన్ని రోజుల్లో  ఫారిన్ టూరిస్టులు 46,700 మంది  వచ్చారు. 2021 సెకండ్ వేవ్​లో ఆ సంఖ్య మరింత పడిపోయింది. ఆ ఏడాది 3,20,00,620 మంది దేశీయ టూరిస్టులు సందర్శించగా, 5,917 మంది ఫారినర్స్ రాష్ర్టానికి వచ్చారు. అయితే, ఈ ఏడాది నవంబర్ 20నాటికి దేశీయ టూరిస్టుల సంఖ్య 6,21,56,073, ఫారిన్ టూరిస్టుల సంఖ్య 56,485కి చేరుకోవడం విశేషం. నిరుడితో పోలిస్తే ఈఏడాది ఫారిన్ టూరిస్టుల సంఖ్య పదింతలు పెరిగింది.

టూరిజం డెస్టినేషన్ గా తెలంగాణ

రాష్ట్రంలో నాగార్జునసాగర్, హుస్సేన్ సాగర్, సోమశిల, సింగూరు, పాకాల, కడెం, ఎల్ఎండీ కరీంనగర్, కిన్నెరసాని, దుర్గం చెరువు, కోమటిచెరువు, రామప్ప, లక్నవరం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 28చోట్ల బోటింగ్ సదుపాయం ఉంది. అలాగే చార్మినార్, గోల్కొడ ఫోర్ట్, ఖిలా వరంగల్, రామప్ప టెంపుల్, తాడ్వాయి హట్స్, కుతుబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాహీ టూంబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేయిస్తంభాల గుడి, అనంతగిరి హిల్స్ దేశ, విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

సెంట్రల్​ ఫండ్స్​తో టూరిస్టు స్పాట్ల అభివృద్ధి 

కేంద్రం తెచ్చిన స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీమ్ లు రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ఊతమిచ్చాయి. స్వదేశీ దర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ములుగు జిల్లా రూ.83కోట్లు), తెలంగాణ ఎకో టూరిజం సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.91 కోట్లు), తెలంగాణ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.99కోట్లు)కు కేంద్రం ఫండ్స్ కేటాయించింది. వీటితో ఆయా జిల్లాల్లో టూరిస్ట్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డెవలప్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల, సింగోటం, అక్కమహాదేవి కేవ్స్, కడళివనం, ఈగలపెంట, ఫర్హాబాద్, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరంతో పాటు ములుగు జిల్లాలోని గట్టమ్మ, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత వాటర్ ఫాల్స్, హైదరాబాద్ లోని కుతుబ్ షాహి హెరిటేజ్ పార్క్, పైగా టూంబ్స్, హయత్ బక్షి మసీదు, రేమాండ్ టూంబ్ వద్ద ప్రస్తుతం మనం చూస్తున్న అభివృద్ధి పనులు, కాటేజీల నిర్మాణం సెంట్రల్ ఫండ్స్ తో చేసినవే. నీతి ఆయోగ్ స్కీమ్ లో కరీంనగర్ ఎల్ఎండీ వద్ద థీమ్ పార్క్ కు రూ.15.17 కోట్లు, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ అభయారణ్యానికి రూ.10.77 కోట్లు, కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి రూ.12.36 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. 

టూరిస్టుల రాక పెరిగింది

ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రాక పెరిగింది. హరిత హోటళ్లు, బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. పర్యాటకానికి మళ్లీ పాత రోజులు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టూరిస్టులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. - బి.మనోహర్, ఎండీ, తెలంగాణ టూరిజం కార్పొరేషన్