 
                                    రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో పనులు తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసి, గృహప్రవేశానికి సిద్ధం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ఇండ్ల పురోగతిపై గురువారం కలెక్టరేట్లో హౌసింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులతో ఆమె రివ్యూ నిర్వహించారు. జిల్లాకు మొత్తం 7,918 ఇండ్లు మంజూరు చేయగా 5,361 ఇండ్లకు ముగ్గు పోశారని, 2,042 బేస్ మెంట్, 1,011 గోడలు, 962 స్లాబ్ లెవెల్ లో ఉండగా, 8 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో ఇప్పటివరకు రూ.49.85 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకోవాలి
కోనరావుపేట, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మిల్లర్లను ఆదేశించారు. కోనరావుపేట మండలం మల్కపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. కొండాపూర్ పెంటివాగు లోలెవెల్ కల్వర్టు దెబ్బతినగా పరిశీలించారు. రిపేర్చేయించాలని అధికారులను ఆదేశించారు.
గద్దెగట్టు చెరువు పరిశీలన
వెంకట్రావుపేటలోని గద్దెగట్టు చెరువుకు బుంగ పడగా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ గురువారం పరిశీలించారు. నీరు తగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో మరమ్మతు చేయించాలని ఆమె ఆదేశించారు. ఇరిగేషన్ఈఈ కిశోర్‌కుమార్, డీఈ క్రాంతికుమార్, ఆర్అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్ర ప్రకాశ్ పాల్గొన్నారు.

 
         
                     
                     
                    