బోల్తా పడిన ట్రక్కు.. ఇద్దరు మృతి

బోల్తా పడిన ట్రక్కు.. ఇద్దరు మృతి

ఖమ్మం నగరంలోని బల్లేపల్లి సమీపంలో మంగళవారం (అక్టోబర్​ 17న) తెల్లవారుజామున లేలాండ్ ట్రక్కు బోల్తా పడింది. మణుగూరు నుండి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.ట్రక్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజు గంజి జిల్లా కర్మహాగ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు.

మణుగూరులో పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఖమ్మం బల్లేపల్లి సమీపానికి రాగానే ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.