ఇయ్యాల్టి  నుంచి టీఎస్ సెట్

ఇయ్యాల్టి  నుంచి టీఎస్ సెట్

ఓయూ, వెలుగు : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే టీఎస్​ సెట్​-‌–2023 పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 49,958 మంది హాజరుకానున్నారని టీఎస్​సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ మురళీ కృష్ణ  సోమవారం తెలిపారు. ఈ నెల 13న నిర్వహించాల్సిన పరీక్షను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 17న నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష సమయానికి పావు గంట ముందే అభ్యర్థులు సెంటర్​లోకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించబోమని పేర్కొన్నారు.