తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం క్లారిటీ

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లోక్‌‌సభలో మంగళవారం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు. 2026వ సంవత్సరం తర్వాత చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం పునర్విభజన ప్రక్రియ చేపడతామని నిత్యానంద క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225కు, తెలంగాణలో 119 నియోజకవర్గాలు 153కు పెరగాల్సి ఉంది. దీంతో ఎంతగా ఆశపడినా నాయకుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది.