కన్జూమర్లను మోసం చేస్తున్న అమెజాన్‌‌!

కన్జూమర్లను మోసం చేస్తున్న అమెజాన్‌‌!

న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్ షాపింగ్ సైట్‌‌ను వాడే రిటైలర్లను  వారికి తెలియకుండానే  ప్రైమ్ సర్వీస్‌‌కు సబ్‌‌స్క్రయిబ్ అయ్యేలా అమెజాన్‌‌ చేస్తోందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌‌టీసీ)  కేసు ఫైల్ చేసింది.  అమెజాన్ ప్రైమ్ సర్వీస్‌‌కు సబ్‌‌స్క్రయిబ్ అవ్వాలని బలవంతం పెడుతోందని, ఒకసారి అయ్యాక సబ్‌‌స్క్రిప్షన్‌‌ను  క్యాన్సిల్ చేసుకోవడం  వీరికి కష్టంగా మారుతోందని తెలిపింది. సియాటల్‌‌లోని ఫెడరల్‌‌ కోర్టులో ఎఫ్‌‌టీసీ  ఈ కేసు ఫైల్ చేసింది. ‘అమెజాన్‌‌ లక్షల మందిని మోసం చేస్తోంది. కన్జూమర్లు తమకు తెలియకుండానే అమెజాన్‌‌ ప్రైమ్‌‌కు సబ్‌‌స్క్రయిబ్ అవుతున్నారు’ అని ఎఫ్‌‌టీసీ పేర్కొంది.

కన్జూమర్లను మానిప్యులేట్ చేస్తోందని, యూజర్ల ఇంటర్‌‌‌‌ఫేస్ డిజైన్లతో ఆటోమెటిక్‌‌గా ప్రైమ్‌‌ సబ్‌‌స్క్రిప్షన్స్‌‌ను రెన్యువల్ చేసుకునేలా చేస్తోందని వెల్లడించింది. కాగా, యూఎస్‌‌లో  ఏడాదికి ప్రైమ్‌‌ సబ్‌‌స్క్రిప్షన్‌‌ 139 డాలర్లు. ప్రైమ్ సబ్‌‌స్క్రిప్షన్స్ వలన అమెజాన్ 25 బిలియన్ డాలర్ల రెవెన్యూని జనరేట్ చేస్తోందని, తాము ఒత్తిడి చేయడం వలన ఈ ఏడాది ఏప్రిల్‌‌లో క్యాన్సిలేషన్ ప్రాసెస్‌‌ను మార్చిందని పేర్కొంది. కాగా, ఎఫ్‌‌టీసీ ఆరోపణలతో అమెజాన్‌‌ షేర్లు బుధవారం నష్టాల్లో ఓపెన్ అయ్యాయి.