వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా కరోనా రాదని గ్యారంటీ లేదు

వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా కరోనా రాదని గ్యారంటీ లేదు
  • వైరస్‌ సోకి నవారు కూడా వ్యా క్సిన్‌ తీసుకో వడమే బెటర్‌
  • చిన్న పిల్లలు, ఇమ్యూనిటీ లేనోళ్లు, అలర్జిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజార్డర్స్‌ ఉన్నోళ్లకు వద్దని సూచన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగువ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా కరోనా రాదని గ్యారంటీ లేదని, తప్పకుండా కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలని పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న యాంటీబాడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గిపోయే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉందని తెలిపారు. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమ్యూనిటీ ఆర్నెల్లు లేదా ఏడాది వరకు శరీరంలో ఉండొచ్చని అన్నారు. కరోనా వచ్చి పోయినోళ్లకు మళ్లీ వైరస్ సోకదని చెప్పలేమని అన్నారు. కరోనా వచ్చిన వారు కూడా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటేనే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని చెప్పారు. చిన్న పిల్లలకు టీకా అవసరం లేదని, వారిపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదని తెలిపారు. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో వస్తున్న సందేహాలపై ‘వీ6 వెలుగు’తో ఆయన మాట్లాడారు. చాలా వరకు ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇతర దేశాల్లోనే జరిగాయని, మన దగ్గర సంక్రాంతికి వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వొచ్చన్నారు. టీకా అందరికీ ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వీళ్లకు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దు

ఇమ్యూనిటీ లేని వాళ్లు, అలర్జిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజార్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండే వాళ్లు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవద్దని శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి సూచించారు. ఇతర జబ్బులు ఉన్న వారికి వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ప్రమాదం ఉండకపోవచ్చని, సివియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నోళ్లకు వాడితే ఏం కాదన్నారు. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరికీ ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదని, దశలవారీగా ఇస్తారని చెప్పారు. ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారియర్స్, వృద్ధులు, జబ్బులు ఉన్నవారికి మొదటగా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలన్నారు. తొలి దశలో వ్యాక్సిన్ సప్లై అంతగా అవసరం ఉండదని తెలిపా రు. టీకా అందరికీ అవసరమా అనేది ఇంకా తెలియదన్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపగలమా అనేది సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నిర్ధారించలేదని చెప్పారు. కోమార్బిడిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న వాళ్లు కరోనా సోకి చనిపోతే దాన్ని కరోనా మరణంగానే పరిగణించాలన్నారు.