
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్థాక్రె భార్య రష్మీ థాక్రె కరోనా చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు. మార్చి 23న ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్పటినుంచి రష్మి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఒంట్లో నీరసంగా ఉండడంతో మంగళవారం రాత్రి ఆమె హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్, బెటర్ ట్రీట్‌మెంట్ కోసం రష్మి హాస్పిటల్‌లో చేరారని తెలుస్తోంది. సీఎం ఉద్దవ్ థాక్రె, రష్మీ థాక్రె మార్చి 11వ తేదీన జేజే హాస్పిటల్‌లో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఉద్దవ్ కొడుకు ఆదిత్య థాక్రెకు మార్చి 20న కరోనా పాజిటివ్ వచ్చింది. శివసేన పత్రిక సామ్నాకు రష్మీ థాక్రె ఎడిటర్‌గా ఉన్నారు.