అవీ..ఇవీ.. ఈ చెట్టంతా పూలే!

అవీ..ఇవీ..  ఈ చెట్టంతా పూలే!

ఫోన్లు విసిరే ఆట

కోపమొచ్చినప్పుడు చేతిలో ఉన్న వస్తువులను విసిరేస్తుంటారు కొందరు. అలా చేయడం వల్ల కోపం కొంత తగ్గుతుంది. ఇదే ఫార్ములా బేస్ చేసుకుని ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌లో మొబైల్ ఫోన్లు విసిరేసే ఆటను తీసుకొచ్చారు. మొబైల్ ఫోన్ త్రోయింగ్ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ అనేది ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌లో అఫీషియల్ స్పోర్ట్. ప్రతి ఏటా ఈ ఛాంపియన్ షిప్ పోటీలు కూడా జరుగుతాయి. 2000లో ఫెన్నోలింగువా అనే కంపెనీ.. పని వల్ల ఉద్యోగుల్లో ఏర్పడే ఫ్రస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను తగ్గించడానికి మొబైల్ ఫోన్స్ విసిరేసే గేమ్‌‌‌‌‌‌‌‌ రూపొందించింది. ఈ ఆటను ఉద్యోగులు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఆట కోసం తమ సొంత మొబైల్స్‌‌‌‌‌‌‌‌ వాడకుండా.. కంపెనీ కొన్ని పాత ఫోన్లను ఇచ్చింది. ఈ ఆట అందర్నీ ఆకట్టుకోవడంతో ప్రతి ఏటా కొనసాగుతూ వచ్చింది. కొంతకాలం తర్వాత అది అన్ని కంపెనీలకు పాకింది. అలా ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ అఫీషియల్ స్పోర్ట్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఆ తర్వాత ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, యూఎస్ దేశాలు కూడా ఈ ఆటను మొదలుపెట్టాయి. ఈ ఆట చాలా సింపుల్. ఇందులో రెండు రౌండ్లు ఉంటాయి. ఆటగాళ్లు మొబైల్స్‌‌‌‌‌‌‌‌ను బలంగా విసరాలి. ఎక్కువ దూరం విసిరిన వాళ్లు విన్నర్స్.
 

ఈ చెట్టంతా పూలే!

ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టును చూడాలంటే జపాన్‌‌‌‌‌‌‌‌లోని ఇషికాగా ఫ్లవర్ పార్క్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలి. ఇక్కడ ఉండే విస్టీరియా చెట్టుకు ‘వరల్డ్​ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీ’గా పేరుంది. ఈ చెట్టుని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. జపాన్‌‌‌‌‌‌‌‌లోని ఇషికాగా పార్క్‌‌‌‌‌‌‌‌లో ఉండే విస్టీరియా చెట్టులో చూద్దామన్నా ఆకులు కనిపించవు. పూర్తిగా పువ్వులే ఉంటాయి. ఈ పూలు మొగ్గగా ఉన్నప్పుడు ఊదా రంగులో, విచ్చుకోగానే గులాబీ రంగులో ఉంటాయి. ఈ చెట్టు వయసు సుమారు150 ఏండ్లు. ఇప్పటికీ  పువ్వులు పూస్తూనే ఉన్నాయి. ఈ  చెట్టు కిందకు వెళ్లి నిల్చుంటే.. పూల వర్షం కురుస్తూ కురుస్తూ మధ్యలో ఆగిపోయిందా అనిపిస్తుంది. ఈ చెట్టును చూసేందుకే ఏటా వేల మంది టూరిస్టులు మార్చి, ఏప్రిల్ నెలల్లో జపాన్ వెళ్తుంటారు.

ఏఐ న్యూస్ రీడర్

అలసట లేకుండా రోజంతా వార్తలు చదివే న్యూస్‌‌‌‌‌‌‌‌ రీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎప్పుడైనా చూశారా? చైనాలోని పీపుల్స్ డైలీ టీవీలో కనిపించే రెన్ జియారొంగ్ అలాంటిదే. అయితే ఈమె నిజమైన మనిషి కాదు. ఏఐతో పనిచేసే డిజిటల్ న్యూస్ రీడర్. ఏఐతో పనిచేసే మొట్టమొదటి న్యూస్‌‌‌‌‌‌‌‌ యాంకర్‌‌‌‌‌‌‌‌ను  చైనా వార్తా సంస్థ పీపుల్స్ డైలీ మొదలుపెట్టింది. చైనీస్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ భాషల్లో మాట్లాడే ఈ డిజిటల్ అవతార్ లైవ్ వీడియోల ద్వారా తనకు తానే నేర్చుకుంటుంది. సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో టైప్‌‌‌‌‌‌‌‌ చేసిన విషయాలను అచ్చం నిజమైన న్యూస్‌‌‌‌‌‌‌‌రీడర్‌‌‌‌‌‌‌‌ లాగానే చదువుతోంది. గొంతు, ముఖ కవళికలు, హావభావాలు అన్నీ సహజంగానే ఉంటాయి. అలసట  లేకుండా 24 గంటలు పనిచేస్తుంది. ఈ యాంకర్‌‌‌‌‌‌‌‌ మొట్టమొదటిసారి తనను తాను పరిచయం చేసుకుంటూ “నా పేరు రెన్. నేనొక డిజిటల్ ఏఐ యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని. వేలమంది న్యూస్ యాంకర్లు వాళ్ల స్కిల్స్‌‌‌‌‌‌‌‌ నాకు నేర్పించారు. ఇకపై 365 రోజులు, 24 గంటలు అలుపెరగకుండా వార్తలు చదువుతాను. ఏ ఫీడ్ బ్యాక్ వచ్చినా తీసుకుంటాను” అని చెప్పింది.