తాను ప్రేమించిన వారికి ప్రేమ గురించి చెప్పాలని చాలా మంది అనుకుంటారు.. కానీ, ఆ ప్రేమని సరిగ్గా తెలియజేయడం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఓ మహిళ కూడా తన ప్రేమను తెలియజేసేందుకు చాలా ఇబ్బందులు పడింది. చివరకు ఓ ఉపాయం ఆలోచించింది. తన భర్తపేరు (సతీష్) నుదిటిపై పచ్చబొట్టుతో పెద్ద అక్షరాలతో రాయించుకొనే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొదట సంతోషం.. ఆ తర్వాత బాధ
వీడియో ప్రారంభంలో ఆ మహిళ సంతోషంగా కనిపించింది. పింక్ డ్రెస్‌లో ఉన్న మహిళ టాటూ వేయించుకోవడానికి సిద్దపడింది. ముందుగా టాటూ ఆర్టిస్ట్ కు సతీష్ అని పేపర్‌పై రాసి మహిళ నుదుటిపై అతికించి ఫాంట్ సైజును ఖరారు చేశారు. ఆ తర్వాత కార్బన్ పేపర్ ద్వారా మహిళ నుదిటిపై ప్రింట్ చేశారు. అప్పటివరకు ఆ స్త్రీ సంతోషంగానే ఉంది. నుదిటిపై సూదితో రాయడం మొదలు పెట్టడంతోనే ఆమె తట్టుకోలేకపోయింది. నొప్పి కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. అప్పుడు ఆమె టాటూ ఆర్టిస్టును వెనక్కు నెట్టింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్
బెంగళూరుకు చెందిన టాటూ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో king_maker_tattoo_studio పేరుతో ఉన్న పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో చాలా రకాల టాటూ డిజైన్లు కనిపించాయి. శాశ్వత కనుబొమ్మలు చేయించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. వైరల్ వీడియో యొక్క క్యాప్షన్‌లో తుది ఫలితం మరొక వీడియోలో చూపబడుతుంది అని వ్రాయబడింది. కానీ దానికి సంబంధించిన ఇతర వీడియో ఈ పేజీలో అప్‌లోడ్ చేయబడలేదు. టాటూ వేయించుకోవాలనే ఆలోచనను మహిళ విరమించుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
