మహిళలు అని కూడా చూడకుండా లాక్కెళ్లారు

మహిళలు అని కూడా చూడకుండా లాక్కెళ్లారు

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్‌బండ్‌’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆర్జీసీ మహిళా కార్మికులను కూడా పోలీసులు ఊడ్చుకెళ్లడంతో ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు తమపై చేయి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ మహిళ కార్మికులు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ట్యాంక్‌‌ బండ్ వైపు నాయకులు పరుగులు తీశామని.. అయినా వదలకుండా వారిని అరెస్ట్ చేశారని తెలిపారు ఆర్టీసీ కార్మికలు.