మహిళా బిల్లు డీలిమిటేషన్ అయ్యాకే అమలులోకి వచ్చే అవకాశం

మహిళా బిల్లు డీలిమిటేషన్ అయ్యాకే అమలులోకి వచ్చే అవకాశం
  • 2026 తర్వాత డీలిమిటేషన్ అయ్యాకే ఈ చట్టం అమలయ్యేందుకు చాన్స్
  • ఆ తర్వాత 15 ఏండ్లే చట్టానికి కాలపరిమితి
  • అవసరమైతే ఆ తర్వాత మళ్లీ పొడిగించుకోవచ్చు

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికిప్పుడు పార్లమెంట్​లో పాస్ అయిపోయినా.. అది 2029లోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అంతకుముందుగా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ జరిగిన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలయ్యేందుకు చాన్స్ ఉంటుంది.అయితే, 2026లో తదుపరి సెన్సస్ (జనాభా లెక్కింపు) జరిగిన తర్వాతే 2027లో డీలిమిటేషన్  ప్రక్రియ జరిగే అవకాశం ఉంది.

Also Raed : కవిత ఇంటి వద్ద సంబురాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 82కు 2002లో చేసిన సవరణ ప్రకారం.. 2026 తర్వాత చేపట్టే ఫస్ట్ సెన్సస్ (జనాభా లెక్కలు) ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి, 2026 తర్వాత ఫస్ట్ సెన్సస్ 2031లో జరగాల్సి ఉండగా, దాని తర్వాత డీలిమిటేషన్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఇంతకుముందు 2021లో జనాభా లెక్కింపు చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సెన్సస్2027లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, అప్పటివరకు ఆగకుండా వెంటనే డీలిమిటేషన్ చేపట్టాలంటే మాత్రం ఆర్టికల్ 82కు మళ్లీ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి.

కాల పరిమితి15 ఏండ్లే..

మహిళా బిల్లులో పేర్కొన్న ప్రకారం.. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లకు కాలపరిమితి15 ఏండ్లు మాత్రమే ఉంటుంది. అవసరం అనుకుంటే ఆ తర్వాత మళ్లీ చట్టాన్ని పొడిగించే అధికారం కూడా పార్లమెంట్​కు ఉంటుంది. అలాగే డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారీ మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లు కూడా రొటేషన్ పద్ధతిలో మారుతాయి.