వలసదారులకు అత్యంత అనుకూల నగరం వాలెన్షియా

వలసదారులకు అత్యంత అనుకూల నగరం వాలెన్షియా

ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిత్యం విదేశాలకు వలస వెళ్తుంటారు. ఇలాంటి వలసదారులకు అత్యంత అనుకూలమైన పని వాతావరణాన్ని కలిగిన అత్యుత్తమ దేశాల జాబితా విడుదలైంది. మొత్తం 50 నగరాలతో రూపొందించిన ఈ జాబితాలో మొదటి స్థానంలో స్పెయిన్​ లోని వాలెన్షియా, రెండో స్థానంలో యూఏఈలోని దుబాయ్​, మూడో స్థానంలో మెక్సికోలోని మెక్సికో సిటీ నిలిచాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా లిస్బన్​ (పోర్చుగల్​), మ్యాడ్రిడ్​ (స్పెయిన్​), బ్యాంకాక్​(థాయ్​ లాండ్​), బాసెల్​ (స్విట్జర్లాండ్​), మెల్​ బోర్న్​(ఆస్ట్రేలియా), అబుధాబి (యూఏఈ), సింగపూర్​ ఉన్నాయి.  

అయితే ఇదే జాబితాలో చివరి 10 స్థానాల్లో  రోమ్​ (ఇటలీ), టోక్యో (జపాన్​), వాంకోవర్​ (కెనడా), మిలాన్​ (ఇటలీ), హాంబర్గ్​ (జర్మనీ), హాంకాంగ్​ (చైనా), ఇస్తాంబుల్​ (టర్కీ), ప్యారిస్​ (ఫ్రాన్స్​), ఫ్రాంక్​ ఫర్ట్​(జర్మనీ), జోహన్నెస్​ బర్గ్​ (దక్షిణాఫ్రికా) నగరాలు ఉన్నాయి. జాబితాలో చివరి స్థానంలోని జోహన్నెస్​ బర్గ్ (దక్షిణాఫ్రికా) నగరం​లో వలసదారుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. టర్కీలోని ఇస్తాంబుల్​ లో వలసదారులకు ప్రతికూల పని వాతావరణం ఉంది. కెనడాలోని వాంకోవర్​ లో ఇండ్ల అద్దెలు భారీగా ఉన్నాయి. జర్మనీలో భాషా సమస్య  ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్​ లోని ప్యారిస్​ లో జీవన వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి.