V6 News

6 బాల్స్‌‌‌‌లో 6 వికెట్లు

6 బాల్స్‌‌‌‌లో 6 వికెట్లు

ఓవర్‌‌‌‌లో ఆరు బాల్స్‌‌‌‌కు ఆరు సిక్సర్లు కొట్టడం చూశాం. అదే.. ఆరు బాల్స్‌‌‌‌కు ఆరు వికెట్లు సాధ్యమా? అంటే   కష్టమే అనాలి. కానీ, ఈ అసాధ్యాన్ని ఓ క్రికెటర్‌‌‌‌ సుసాధ్యం చేశాడు. ఒకే ఓవర్లో ఒక రనౌట్ సహా  ఆరుగురిని పెవిలియన్‌‌‌‌ చేర్చి ఔరా అనిపించాడు. నేపాల్‌‌‌‌ ప్రొ క్లబ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మలేసియా యంగ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ విరణ్ దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఈ ఫీట్‌‌‌‌ సాధించాడు. ఈ టోర్నీలో మలేసియా క్లబ్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఆడుతున్న విరణ్ ఈనెల 11వ తేదీన రూపాందేహి టీమ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో మ్యాజిక్​ చేశాడు. రూపాందేహి ఇన్నింగ్స్‌‌‌‌ చివరి ఓవర్లో బౌలింగ్‌‌‌‌ చేసిన లెఫ్టామ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ విరణ్​ తొలి బాల్‌‌‌‌కు ఓ బ్యాటర్‌‌‌‌ను క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేశాడు. రెండో బాల్‌‌‌‌కు ఇంకో బ్యాటర్‌‌‌‌ రనౌటయ్యాడు. తర్వాతి నాలుగు బాల్స్‌‌‌‌కు నలుగురిని ఔట్‌‌‌‌ చేసిన విరణ్​ హ్యాట్రిక్‌‌‌‌ కూడా సాధించాడు. ఈ ఓవర్‌‌‌‌లో అతని ఖాతాలో ఐదు వికెట్లు చేరగా మ్యాచ్‌‌‌‌లో మలేసియా క్లబ్‌‌‌‌ విజయం సాధించింది. కాగా, ఆరు బాల్స్‌‌‌‌లో ఆరు వికెట్లు పడటం ఇదే తొలిసారి కాదు. 1951లో థామస్‌‌‌‌ హండర్‌‌‌‌ కప్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌) టోర్నీలో ఓ బౌలర్‌‌‌‌ ఆరు బాల్స్‌‌‌‌లో ఆరు వికెట్లు పడగొట్టగా.. కొన్ని లోకల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లోనూ ఈ ఫీట్‌‌‌‌ సాధ్యమైందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెబుతున్నారు.