
మొదటి సినిమా ‘జెట్టి’ తో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు కృష్ణ మానినేని. సినిమాలు చేస్తూనే.. ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ పేరుతో గత 8 సంవత్సరాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని వరద బాధితులకు రూ.పది లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఈ చెక్‌ను శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందించాడు. తమ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ప్రశంసించారని కృష్ణ చెప్పాడు.