ప్రేమ పేరుతో మోసం చేసిందని యువకుడి నిరసన

ప్రేమ పేరుతో మోసం చేసిందని యువకుడి నిరసన

మంచిర్యాల : ప్రియుడు మోసం చేశాడంటూ ప్రియురాలు ధర్నా చేసిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ మంచిర్యాల జిల్లాలో సీన్ రివర్సైంది. తనను మోసం చేసిందంటూ ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తేలేదని అంటున్నాడు. 

మంచిర్యాల జిల్లాకు చెందిన చాతరాజు ప్రవీణ్ అదే ప్రాంతానికి చెందిన యువతి 2015 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఏడేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి అడిగినప్పుడల్లా డబ్బుతో పాటు అప్పుడప్పుడూ బంగారు నగలు కానుకలుగా ఇచ్చినట్లు ప్రవీణ్ చెబుతున్నాడు. ఇలా ఇప్పటి వరకు గోల్డ్తో పాటు  దాదాపు రూ.5లక్షల నగదు ఇచ్చానని అంటున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో తనను దూరం పెట్టిన ప్రియురాలు మరొకరితో పెళ్లికి సిద్ధమైనట్లు  ప్రవీణ్కు తెలిసింది. దీంతో ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు పట్టుకుని ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగాడు. యువతి తన తల్లి, అక్కకు భయపడి వేరే పెళ్లి చేసుకుంటోందని ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని అంటున్నాడు.