బ్రేకింగ్: తెలంగాణ రాజ్ భవన్‎లో చోరీ.. హార్డ్ డిస్క్‎లు మాయం..!

బ్రేకింగ్: తెలంగాణ రాజ్ భవన్‎లో చోరీ.. హార్డ్ డిస్క్‎లు మాయం..!

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రాజ్ భవన్‎లో చోరీ తీవ్ర కలకలం రేపింది. రాజ్ భవన్‎ ఫస్ట్ ఫ్లోర్‎లోని సుధర్మ భవన్‎లో హార్డ్ డిస్క్‎లు చోరీకి గురయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా చోరీ జరిగినట్లు గుర్తించిన రాజ్ భవన్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫస్ట్ ఫ్లోర్‎లో ఉన్న సుధర్మ భవన్‎లో హార్డ్ డిస్క్‎లు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల (మే) 14న చోరీ జరిగినట్లు తెలిపారు.

ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని కంప్యూటర్‎లోకి వెళ్లి హార్డ్ డిస్క్‎లు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు చెప్పారు. చోరీకి గురైన హార్డ్ డిస్కులలో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే రాజ్ భవన్‎లో చోరీ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్ భవన్‎లో చోరీ ఘటనను సీరియస్‎గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. 

రాజ్ భవన్ చోరీ కేసు నిందితుని అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. చోరీకి గురైన హార్డ్ డిస్క్‎లు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్‎గా గుర్తించారు. హార్డ్ డిస్క్‎లు ఎందుకు చోరీ చేశాడు..? ఎవరు చేయమన్నారు..? హార్డ్ డిస్క్‎లోని డేటాను ఏమైనా దుర్వినియోగం చేశాడా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.