లేడీస్ ఎంపోరియంలో చోరీ

లేడీస్ ఎంపోరియంలో చోరీ

కూకట్​పల్లి, వెలుగు: బాలానగర్​లోని ఉమా మహేశ్వర లేడీస్ ఎంపోరియంలో శనివారం మధ్యాహ్నం ముగ్గురు మహిళలు కస్టమర్ల ముసుగులో ప్రవేశించి, మగ్గం మెటీరియల్ చోరీ చేశారు. ఇద్దరు మహిళలు నిర్వాహకుల దృష్టిని మళ్లించగా, మరొకరు మెటీరియల్​ను కొంగులో దాచుకుని జారుకున్నారు. సోమవారం స్టాక్ తనిఖీలో అనుమానం రావడంతో నిర్వాహకులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. చోరీ విషయం వెలుగులోకి రావడంతో బాలానగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఆధారంగా ముగ్గురు నిందిత మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు.