పోలీసులు లాక్డౌన్ డ్యూటీలో.. దొంగలు తమ పనిలో..

పోలీసులు లాక్డౌన్ డ్యూటీలో.. దొంగలు తమ పనిలో..

లాక్డౌన్ వేళ దొంగల హల్ చల్

కరోనాకు బయపడి ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకుండా ఉంటుంటే.. దొంగలు మాత్రం భయపడకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. పోలీసులు కరోనా డ్యూటీలో బిజీగా ఉంటే.. దొంగలు తమ పనిలో బిజీగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో దొంగలు పడ్డారు. బుధవారం అర్ధరాత్రి నలుగురు దొంగలు నెక్కర్లతో గ్రామంలోకి చొరబడి రెండిళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. ఒక ఇంట్లోని గోస్కె కృష్ణవేణి అనే గృహిణి మెడలోని 3 తులాల మంగలసూత్రాలను మరియు మరో ఇంట్లోని గుత్తి బాలమణి అనే గృహిణి మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడును కత్తిరించుకువెళ్లారు. అంతేకాకుండా.. లాలమోని వెంకటయ్య అనే వ్యక్తి యొక్క సెల్ ఫోనును కూడా దొంగిలించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

For More News..

కువైట్ లో రోడ్డున పడ్డ తెలుగు ప్రజలు

మందుకోసం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని 19 ఏళ్ల కొడుకుని..

బస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చిన ఆర్టీసీ