సంగారెడ్డిలో భారీ దొంగతనం.. ఒకే రోజు మూడు ఏటీంఎలలో చోరీ

సంగారెడ్డిలో భారీ దొంగతనం.. ఒకే రోజు మూడు ఏటీంఎలలో చోరీ

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఏటీఎం చోరీలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఏటీఎంలు టార్గెట్ గా చోరీకి పాల్పడుతున్నారు.  ఎవరూ లేని సమయంలో రాత్రిపూట ఏటీఎంలు టార్గెట్ చేస్తున్నారు. సీసీ కెమెరాలున్నా ఏ మాత్రం వెనకాడటం లేదు దొంగలు..దొరికిన కాడికి దోచుకుంటున్నారు.   కొన్ని చోట్ల ఏటీఎంలో మనీ చోరీ చేయగా.. మరి కొన్ని చోట్ల ఏకంగా ఏటీంఎలనే ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం. ఆ మధ్య ఏకంగా జేసీబీతోనే ఏటీఎంను బద్దలు కొట్టిన ఘటనలు చూశాం.

లేటెస్ట్ గా సంగారెడ్డి జిల్లా  సదాశివ పేటలో  మూడు ఏటీఎంలో చోరీ జరగడం కలకలం రేపుతోంది.  డిసెంబర్ 12న రాత్రి  మూడు ఎస్బీఐ ఏటీఎంలలో మనీని ఎత్తుకెళ్లారు దుండగులు. బస్వశ్వేర మందిరం రోడ్ లోని ఏటీఎమ్  తో పాటు... గాంధీ చౌక్ లోని ఏటీఎమ్,  బాలికల పాఠశాల రోడ్డులోని  ఏటీఎంలలో చోరీ చేశారు. చోరీ జరిగిందని బ్యాంక్ సిబ్బంది పిర్యాదు చేయడంతో    సదాశివ పేట పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.  క్లూస్ టీమ్ తో పరిశీలించి  కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఇది అంతరాష్ట్ర దొంగల పనా? లేక ఎవరు చేశారనేదానిపై ఆరాదీస్తున్నారు. 

మూడు ఏటీఎంలలో దొంగలు ఎంత డబ్బు ఎత్తుకెళ్లారనేదానిపై స్పష్టత లేదు.. బ్యాంకు అధికారులు గానీ, పోలీసులు కానీ వివరాలు  వెల్లడించలేదు.