సిరిసిల్ల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం

సిరిసిల్ల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. 20 రోజుల్లో మూడు సార్లు దొంగతనాలు చేశారు. ఇప్పటి వరకు ఆరు ఇళ్లలో 8 తులాల బంగారం చోరి జరిగింది. సోమవారం రాత్రి ఒంటరిగా ఉంటున్న కదిరే బాలవ్వ అనే వృద్దురాలు ఇంట్లో  చోరికి ప్రయత్నించారు. కానీ ఇంట్లో  ఏమి లేకపోవడంతో దొంగలు వెనుదిరిపోయారు. ఊరి దొంగల లేక బయటి వాళ్ల అనుమానంతో టెన్షన్ పడుతున్నారు గ్రామస్తులు.