
మహారాష్ట్రంలోని ఓ వీధిలో ఉన్న మొత్తం షాపులన్నిటిని లూఠీ చేశారు. ఒక్కషాప్ కూడా వదలకుండా చోరీ చేశారు. చివరికి వైన్ షాప్ లో వారు చోరి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ చోరి పూణె నగరంలోని కొంద్వా ప్రాంతంలోని సోమవారం అర్ధరాత్రి జరిగింది. రాజాజీ బార్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.40వేల విలువైన విలువైన లిక్కర్, మరియు రూ.15వేల విలువైన నగదు దోచుకెళ్లారు. ఈ చోరికి కొన్ని రోజుల ముందే అదే ఎరవాడలోని మిఠాయి షాప్, డ్రైఫ్రూట్ షాప్ లో దొంగతనం జరింగింది. కానీ అక్కడ దొంగలు గురించి చిన్న ఆధారాలు కూడా దొరకలే.
ALSO READ | మధ్యప్రదేశ్లో రైలు పట్టాలపై ఐరన్ ఫ్రేమ్..తప్పిన పెను ప్రమాదం
రాజాజీ బార్ యజమాని శుభం అన్నాసాహెబ్ తప్కీర్ కోంధ్వా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు దొంగలు బార్ లో డబ్బు, మద్యం కోసం వెతుకుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారి కోసం గాలిస్తున్నారు. పూణె పోలీసులు నిఘా పెంచారు.
#WATCH | Pune: Thieves Break Into Bar In Kondhwa, Steal Cash & Liquor Worth Over Rs 40,000#PuneNews #Maharashtra pic.twitter.com/NZ6fvoIEcd
— Free Press Journal (@fpjindia) October 9, 2024