కొత్త ఓట్ల నమోదు లిస్ట్ లో అవకతవకలున్నయ్: పాల్వాయి స్రవంతి

కొత్త ఓట్ల నమోదు లిస్ట్ లో అవకతవకలున్నయ్: పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు మాత్రమే అమ్ముడుపోతున్నారని, ఓటర్లు కాదని ఆరోపించారు. మునుగోడులో త్రిముఖ పోటీ ఉంటుందన్న ఆమె... కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్యం, డబ్బుల పంపిణీకి దూరంగా ఉందని, ఓటర్లు తమ వెంట ఉన్నారని స్పష్టం చేశారు.

14వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేస్తానని పాల్వాయి స్రవంతి చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా ఇక్కడ ప్రచారం చేస్తున్నారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందన్న స్రవంతి... 8 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యను మొదట పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీనేనని ప్రకటించారు.