ఐఎంఎఫ్ అంచనాల్లో తప్పులున్నాయ్‌‌‌‌! : ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ

ఐఎంఎఫ్ అంచనాల్లో తప్పులున్నాయ్‌‌‌‌! : ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ

న్యూఢిల్లీ: ఇండియా జీడీపీ గ్రోత్‌‌‌‌కు సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌‌‌‌ (ఐఎంఎఫ్‌‌‌‌) వేసిన  అంచనాల్లో తప్పులుండే అవకాశం ఉందని  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ  పేర్కొంది.  ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేకపోయినా, తాజా ఎకనమిక్ డేటా  చూస్తే ఐఎంఎఫ్‌‌‌‌ వేసిన అంచనాల్లో తప్పులున్నట్టు కనిపిస్తోందని వెల్లడించింది.  

దేశ వృద్ధి రేటు ఐఎంఎఫ్ వేసిన అంచనాల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కాగా, ఈ ఏడాది దేశ జీడీపీ గ్రోత్ రేటు 5.9 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్‌‌‌‌ అంచనావేసింది. గతంలో వేసిన 6.1 శాతం అంచనా నుంచి తగ్గించింది. లోకల్‌‌‌‌గా వినియోగం తగ్గిందని, గ్లోబల్‌‌‌‌గా పరిస్థితులు బాగోలేవనే  కారణాలు చెప్పింది.  2024–25 గాను దేశ జీడీపీ గ్రోత్ రేటు అంచనాను 6.8 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది.