ఫార్మా ఇండస్ట్రీకి రూల్స్​ బెడద ఉండదు

ఫార్మా ఇండస్ట్రీకి రూల్స్​ బెడద ఉండదు

ముంబై: బిజినెస్​ నిర్వహణ ఈజీ చేసేందుకు ఫార్మా ఇండస్ట్రీకి రూల్స్​బెడదను తగ్గించనున్నట్లు కేంద్ర కెమికల్స్​, ఫెర్టిలైజర్స్​ మినిస్టర్​ మన్శుక్​ మాండవీయ చెప్పారు. పరిశ్రమ రంగంతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలనేదే మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇండియన్​ డ్రగ్​ మాన్యుఫాక్చరర్స్​ అసోసియేషన్​ (ఐడీఎంఏ) ఈవెంట్​లో గురువారం మంత్రి పాల్గొన్నారు. ఐడీఎంఏ ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఈవెంట్​ నిర్వహించారు. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​కు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వ్యాపారాన్ని ఈజీగా చేసుకునేలా చూడాలనేదే తమ ఫోకస్​అని మన్శుక్​ మాండవీయ పేర్కొన్నారు.

ఈ దిశలోనే ,  కొత్త పాలసీలను తెచ్చే ముందు సంబంధిత వర్గాలు అందరితోనూ చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయడం వల్లే ఇప్పుడు గ్లోబల్​గా మన ఫార్మా ఇండస్ట్రీ కి మంచి పేరు వచ్చిందన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మన ఫార్మా ఇండస్ట్రీ కోసం రూ. 15 వేల కోట్ల పీఎల్​ఐ స్కీమును అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా దిగుమతి చేసుకుంటున్న 35 ఏపీఐలు ఇప్పుడు మన దేశంలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.