పెళ్లికి రెడీ అయిన హీరో రామ్! ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

పెళ్లికి రెడీ అయిన హీరో రామ్!  ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే..ప్రభాస్ పేరు ఠక్కున చెబుతారు. ఆ తర్వాత బ్యాచిలర్ ఎవరయ్యా అంటే రామ్,నితిన్ పేరు చెబుతారు. ప్రస్తుతం హీరో రామ్(Ram Pothineni) మ్యారేజ్ గురుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్ తో..రామ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడనే న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరని చర్చించగా..కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran)​ అని టాక్ వినిపిస్తోంది. ఈ యంగ్ బ్యూటీ..హీరో రామ్​ పోతినేనితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా  వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు ఫిలింనగర్ నుంచి రూమర్లు వినిపిస్తున్నాయి.

దీంతో తర్వలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆ పరిచయంతో వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరూ ఇంకా స్పందించలేదు.

సినీ తారలు ప్రేమలో పడటం..పెళ్లి పీటలెక్కడం సర్వసాధారణం. ఇటీవల పలువురు సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా కొన్నాళ్ళు ప్రేమించుకొని..ఇంట్లో పెద్దవారు ఒప్పుకున్న తర్వాతే బయట ప్రపంచానికి చెప్పారని, అలాగే  వీరిద్దరు కూడా చేస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది..వీరిద్దరూ అధికారికంగా అనౌన్స్ చేస్తేనే స్పష్టత వస్తుంది.ఇక అప్పటివరకు..సోషల్ మీడియాలో ఎవరికి తోచినది వారు రాసుకోవడమే అంటున్నారు సినీ క్రిటిక్స్.