బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయన్న మహిళలపై గండ్ర జ్యోతి ఆగ్రహం

బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయన్న మహిళలపై గండ్ర జ్యోతి ఆగ్రహం

హనుమకొండ జిల్లా : మహిళలపై వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మండిపడ్డారు. శాయంపేట మండలంలో బతుకమ్మ చీరల పంపణి కార్యక్రమంలో గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చీరలు నాసిరకంగా ఉన్నాయన్న మహిళలపై గండ్ర జ్యోతి సీరియస్​ అయ్యారు. ఇష్టం ఉంటే కట్టుకోండి... లేకపోతే పక్కకు పెట్టండి అని చెప్పారు. చీరల విషయంలో ఆడవాళ్లను మెప్పియాలంటే ఎవరి వల్లా కాదన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెడుతలేరు గానీ..  కేసీఆర్ ప్రేమతో చీరలు ఇస్తే ఇన్ని వంకలు పెడుతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ : హోదా మరచి మోదీ దిగజారి మాట్లాడారు : కడియం 

గండ్ర జ్యోతి చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి. చీరలు బాగోలేవని అన్నందుకు ఇలా సీరియస్ అవుతారా...? అని ప్రశ్నిస్తున్నారు పలువురు మహిళలు.