మాట ‘వెండి’ అయితే మౌనం ‘బంగారం’

మాట ‘వెండి’ అయితే మౌనం ‘బంగారం’

మాట ‘వెండి’ అయితే మౌనం ‘బంగారం’ అనే సామెత ఉంది. అయితే రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఈ ఫార్ములా పనిచేయకపోవచ్చు. పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్ మధ్య  ఉండే సైలెన్స్.. కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తే మరికొన్నిసార్లు సొల్యూషన్ అవుతుంది. అందుకే మౌనం ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటున్నారు సైకాలజిస్టులు. రిలేషన్‌‌షిప్‌‌లో సైలెన్స్ ఎలాంటి రోల్ పోషిస్తుందో సైకియాట్రిస్ట్ కార్లీ స్నైడర్ వివరించారిలా..

భార్యాభర్తల మధ్య ఉండే సైలెన్స్‌‌‌‌‌‌‌‌లో  రెండు రకాలుంటాయి. ఇద్దరి మధ్యా గొడవ జరుగుతున్నప్పుడు ఒకరు సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉండి, ఎదుటివాళ్ల కోపాన్ని తగ్గిస్తుంటారు. దీన్ని ‘పాజిటివ్ సైలెన్స్’ అంటారు. ఇది పరిస్థితిని అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన మౌనం.  దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇంకోరకమైన మౌనం ఉంది. ఎదుటివారిపై ఉండే  కోపం లేదా అసహనాన్ని మౌనం ద్వారా చూపించడం. దీన్నే ‘సైలెంట్ ట్రీట్మెంట్’ అంటారు. అంటే ఒకరిపై గెలవడానికి మౌనాన్ని ఆయుధంలా వాడడం అన్నమాట.  ఇలాంటి సైలెన్స్ వల్ల రిలేషన్ మరింత వీక్ అవుతుంది.

సైలెంట్ ట్రీట్మెంట్
కోపాన్ని బయటకు చూపించలేని కొంతమంది కావాలని సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో అవతలి వాళ్లు బతిమిలాడితే  సిచ్యుయేషన్ నార్మల్ అవుతుంది.  అలా కాకుండా ఇద్దరూ బెట్టు చేస్తూ  మౌనంగా ఉండడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. కొంతమంది  ఇలా చేసినా కూడా మాట్లాడకుండా మొండిగా ప్రవర్తిస్తుంటారు.‘నాకేం కోపం లేదు’ అంటూనే కావాలని మౌనంగా ఉంటుంటారు. అలా నిశ్శబ్దంతో వేధించడం వల్ల  పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అసహనం, నిర్లక్ష్యం లాంటివి పెరుగుతాయి.  తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ మాట్లాడుకున్నా.. మనసులో ఆ కోపం అలాగే ఉండిపోతుంది. అలా మౌనం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి మౌనానికి దూరంగా ఉండాలి. 

ఇది ప్రమాదం
ఇక మరో రకమైన మౌనం ఉంటుంది.  నిస్సహాయత నుంచి పుట్టిన మౌనం. పార్ట్‌‌‌‌‌‌‌‌నర్ తనని  అర్థం చేసుకోవడం ఎప్పటికీ  జరగదు అనే అభిప్రాయానికి  వచ్చిన తర్వాత ఈ మౌనం మొదలవుతుంది. డొమెస్టిక్ వయెలెన్స్‌‌‌‌‌‌‌‌ను ఫేస్ చేస్తున్నవాళ్లు కూడా ఈ కోవకే చెందుతారు. వీళ్లు బయట అందరితో  మామూలుగా మాట్లాడుతూ.. ఇంట్లో మాత్రం మౌనంగా ఉంటారు.  ఇలాంటి సైలెన్స్ ఉందంటే పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్ మధ్య భయంకరమైన అడ్డుగోడలు ఉన్నాయని అర్థం. వాటిని మాటలతో బ్రేక్ చేద్దామని చూసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చేసేదేమి లేక ‘జీవితాంతం మౌనంగా ఉండిపోదాం’ అనే నిర్ణయానికొస్తారు. ఇలాంటి వాళ్లు ఎప్పుడు మాట్లాడదామా?  అని జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కానీ మాట్లాడలేరు. ఈ మౌనానికి నిపుణుల సాయం అవసరం. ఇలాంటి సందర్భాల్లో కౌన్సెలింగ్ ద్వారా ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించొచ్చు. చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే...  మాటల మధ్య మౌనం బాగుంటుంది. కానీ మౌనం మధ్య మాటలు బాగోవు. మాటని సరిగ్గా వాడుకోగలిగితే మౌనం అవసరం లేదు.

ఇలా చేయాలి
పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్ మధ్య సైలెన్స్ ఏర్పడినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించాలి. ఎవరో ఒకళ్లు తగ్గాలి. పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలాగైనా  మాట్లాడించే ప్రయత్నం చేయాలి. అప్పటికీ మౌనం వీడకపోతే చేతలతో అయినా ప్రేమను చూపించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే ‘సారీ’ చెప్పాలి. వాళ్ల కోపం తీరేవరకూ మాట్లాడనివ్వాలి. వాళ్లేం చెప్తున్నారో పూర్తిగా వినాలి. ఒకసారి వాళ్ల కోపం తగ్గాక సిచ్యుయేషన్‌‌‌‌‌‌‌‌ను వివరించాలి. కావాలని మౌనంగా ఉండే  అలవాటు కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉండి ఉండొచ్చు. అలాంటి వాళ్లతో మౌనం వల్ల వచ్చే నష్టాన్ని చెప్పి, వాళ్ల అలవాటుని  మార్చడానికి ట్రై చేయాలి.