పోలీస్ ఉద్యోగాల‌‌కు భారీగా ద‌‌ర‌‌ఖాస్తులు

V6 Velugu Posted on May 14, 2022

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో 17 వేల పైచిలుకు పోలీసు ఉద్యోగాల‌‌ భర్తీకి నోటిఫికేష‌‌న్ విడుద‌‌ల‌‌ చేసిన విష‌‌యం తెల్సిందే. వాటికి ఈ నెల 2 నుంచి ఆన్‌‌లైన్‌‌ అప్లికేషన్స్‌‌ స్వీకరిస్తున్నారు. శుక్రవారం నాటికి 4.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు వెల్లడించింది. లక్షకు పైగా మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అందాయని బోర్డ్‌‌ చైర్మన్‌‌ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 53 శాతం బీసీ, 22 శాతం ఎస్సీ, 19శాతం ఎస్టీ, 6 శాతం ఓసీ అభ్యర్థులు అప్లికేషన్స్‌‌ చేసుకున్నారని వివరించారు. ప్రిలిమినరీ క్వశ్చన్‌‌ పేపర్‌‌ ‌‌తెలుగులో ఇవ్వాలని 2/3 శాతం మంది, ఇంగ్లీష్‌‌లో కావాలని 1/3 శాతం మంది అభ్యర్థులు కోరినట్టు పేర్కొన్నారు. ఈ నెల 20న రాత్రి 10 గంటలతో దరఖాస్తు గడువు ముగుస్తుందని, గడువు పెంచే అవకాశం లేదని స్పష్టం చేశారు. 

Tagged Huge, Srinivas Rao, Online applications, police jobs, Telengana, Police Recruitment Board

Latest Videos

Subscribe Now

More News