ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేకు పాలనపరంగా తేడా ఉంది :   ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేకు పాలనపరంగా తేడా ఉంది :   ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్,  వెలుగు: ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేకు మధ్య పాలనపరంగా తేడా ఉందని, ఈ వ్యత్యాసం తెలవకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  రెండేండ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఎందుకు పోటీ చేస్తున్నారని మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడికి, లోకసభ సభ్యుడికి వ్యత్యాసం తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గ పరిధిలో  ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషిస్తాడని, ఎమ్మెల్సీ కేవలం ఎంపీటీసీ పదవి లాంటిదన్నారు.  జగిత్యాల ప్రజానీకం సేవలో నిమగ్నమయ్యేందుకే ఎమ్మెల్యే  పదవికి పోటీ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.