- అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హుస్నాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3 న హుస్నాబాద్పట్టణానికి రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా పర్యటన వివరాలు వెలువడకపోయినా, సీఎం పర్యటన ఖాయమని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ కాలేజీ, వెటర్నరీ ఆస్పత్రి భవన నిర్మాణం, హుస్నాబాద్ - అక్కన్నపేట మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మాణం, తోటపల్లిలో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, సర్వాయి పాపన్న గుట్టల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం పర్యటనలో భాగంగా పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ట్రాక్టర్లతో చదును చేపిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరైన స్థలంలోనే ఈ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు.
