దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 16,103 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 13,929 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  గత 24 గంటల్లో కొవిడ్ వల్ల 31 మంది చనిపోయారు.   తాజాగా నమోదైన కేసులతో  మొత్తం కేసుల సంఖ్య 4,35,2,429కి చేరాయి.  ఇప్పటి వరకు 4,28, 65, 519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.  కొవిడ్ సోకి 5,25,199 మంది మృతిచెందగా..మరో 1,11,711 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో  0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం ఉందని వెల్లడించింది. అలాగే  రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉందని చెప్పింది. ఇక  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.