వాట్సాప్ లో  స్క్రీన్ లాక్ ఫీచర్‌

వాట్సాప్ లో  స్క్రీన్ లాక్ ఫీచర్‌

వెబ్ వాట్సాప్ వాడేటప్పుడు చాట్, స్టేటస్ లో వచ్చిన ఫొటోలు అందరికీ కనిపిస్తుంటాయి. డెస్క్ టాప్ దగ్గర లేనప్పుడు ఇతరులు మన అకౌంట్ చూసి, సీక్రెట్స్ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కారణాలవల్ల ఇబ్బంది పడుతుంటారు యూజర్లు. ఈ సమస్యను పరిక్షించాలని చాలామంది మెటాను కోరారు. దానిపై స్పందించిన మెటా  వెబ్ వాట్సాప్ కోసం స్క్రీన్ లాక్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. 

ఇందులో మొబైల్ కి సెట్ చేసుకున్నట్టే వెబ్ వాట్సాప్ కి కూడా పిన్ నెంబర్ (లాక్) సెట్ చేసుకోవచ్చు. దానివల్ల ఇతరులు మన వాట్సాప్ చూడలేరు. డెస్క్ టాప్ పై కనిపించే స్టేటస్, చాట్, ప్రొఫైల్ పిక్ ఫొటోలను కూడా చిన్న సెట్టింగ్ తో ఆటోమెటిక్ గా బ్లర్ చేయొచ్చు. దీనివల్ల వినియోగదారులకు వ్యక్తిగత ప్రైవసీ ఉంటుంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.