రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైంది

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైంది

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు యువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి. అణచివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రం బాగుండాలంటే యువత, మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో యువ తెలంగాణ  ఆధ్వర్యంలో ‘‘ రాజకీయాల్లో యువత ఆవశ్యకతపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, అడ్వకేట్లు హాజరయ్యారు. యువత రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందన్నారు నేతలు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు యువత, మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.