
నల్గొండ, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు పరిమితి లేదు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టారన్నది ఎలక్షన్ కమిషన్‌కు చెప్పాల్సిన అవసరముండదు. కానీ అన్ని ఖర్చులను ఆఫీసర్లు రికార్డ్ చేస్తారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ఎంత ఖర్చు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది. ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేకపోతే ఇంకెంత ఖర్చు పెడతారోనన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారం, ప్రకటనలకు మాత్రం జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రచారం కోసం వినియోగించే సౌండ్ సిస్టమ్‌కు, ర్యాలీలకు, హోర్డింగ్‌లకు ఆయా జిల్లాల్లో ఏఆర్ఓలు పర్మిషన్లు జారీ చేస్తారు. అన్ని పార్టీలకు హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకుగానూ మున్సిపాలిటీలు, కార్పొరేష న్లు ఒకే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఎమ్మెల్సీ సీటు పరిధిలోని 12 జిల్లాల్లో మీడియా సర్టిఫికే షన్, మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. మీడియాలో ప్రచారానికి మూడు రోజులు ముందే ఈ కమిటీల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అబ్జర్వర్‌గా యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌ను నియమించారు. ఫిర్యాదులు చేసేందుకు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో 1950 కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సు లను నల్గొండలోని గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్ సెంటర్‌కు తరలిస్తారు. ఓటర్లకు స్లిప్‌ల పంపిణీలో పోలింగ్ ఏజెంట్లు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని రిటర్నింగ్ ఆఫీసర్, నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లతో ఆయన శనివారం మీటింగ్ నిర్వహించారు. మార్చి 5లోగా బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలను అందజేయాలని చెప్పారు. ఓటరుగా అర్హులైన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, కొవిడ్ 19 సస్పెక్ట్స్257 మందిని గుర్తించారు. వీరికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తారు