ఖర్చు పెట్టడానికి మా దగ్గర పైసల్లేవ్!

ఖర్చు పెట్టడానికి మా దగ్గర పైసల్లేవ్!

 న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వద్ద ఖర్చు పెట్టడానికి పైసల్లేవని, పార్టీ ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆయన చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. “అదంతా ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్ము. బీజేపీ దానిని ఫ్రీజ్ చేసింది. 

ఇప్పుడు ఖర్చు పెట్టడానికి మా దగ్గర పైసల్లేవు. దొంగపనులు బయటకు వస్తాయని ఆ పార్టీ మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కొనుగోలు చేసిన దాతల వివరాలు బయటపెట్టడం లేదు. అందుకే జులై వరకు సమయం అడిగింది”అని ఖర్గే పేర్కొన్నారు. దేశంలోని రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని  కోరారు.