బీజేపీని వీడే ప్రసక్తే లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీజేపీని వీడే  ప్రసక్తే లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలు మార్చుకునే వ్యక్తిత్వం తనది కాదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తానేకాదు.. ముఖ్య నాయకులెవరూ బీజే పీని వీడరని తేల్చి చెప్పారు.

‘‘కేసీఆర్ కుటుం బ పాలనను అంతం చేసే దిశగా బీజేపీ సైనికులమై ముందుకు కదులుతాం. నా చుట్టూ ఉన్న సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయ మార్గాన్ని ఎంచుకున్న. ఆ దిశగానే ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేశా. ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంపీ పదవిని వదులుకున్న”అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వేలాది యువజన, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, సబ్బండవర్గాలతో కలిసి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు.